రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో టీమిండియా(IND vs ENG) ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయినప్పటికి భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)అదరగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లీష్ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతూ 5/24 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును సాధించాడు. స్వదేశంలో జరిగిన ఓ ద్వైపాక్షిక సిరీసులో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలి మ్యాచ్‌లో మూడు, రెండో మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక మూడో మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టడంతో మొత్తం 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
స్వదేశంలో టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లు..
వరుణ్ చక్రవర్తి – 10 వికెట్లు (ఇంగ్లాండ్‌పై)
రవిచంద్రన్ అశ్విన్ – 9 వికెట్లు (శ్రీలంకపై)
రవి బిష్ణోయ్ – 9 వికెట్లు (ఆస్ట్రేలియాపై)
యుజ్వేంద్ర చాహల్ – 8 వికెట్లు (ఇంగ్లాండ్‌పై)
యుజ్వేంద్ర చాహల్ – 8 వికెట్లు (శ్రీలంకపై)