Friday, January 31, 2025
HomeతెలంగాణBRS Party: బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే..?

BRS Party: బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే..?

బీఆర్ఎస్ పార్టీకి(BRS Party) వచ్చిన విరాళాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ పార్టీ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘంకు సమర్పించిన ఆడిట్ రిపోర్ట్(Audit Report) చర్చనీయాంశంగా మారింది. గతేడాది మార్చి 31 నాటికి పార్టీకి ఏకంగా రూ.1,618 కోట్ల ఆస్తులు ఉన్నాయని రిపోర్టులో పేర్కొంది. 2023–24లో పార్టీకి వచ్చిన విరాళాలు, బ్యాంకు వడ్డీ కలిపి రూ.685.5 కోట్లు ఉన్నాయని వెల్లడించింది. ఈ రిపోర్టులో వెల్లడించిన ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఆస్తుల వివరాలు..

- Advertisement -

“2024 మార్చి 31 నాటికి ఆస్తుల విలువ.. రూ.1,618 కోట్లు. ఇందులో రూ.1,110 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. 2023‌‌‌‌-24 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న విరాళాలు, బ్యాంకు వడ్డీ కలిపి రూ.685.5 కోట్లు. అందులో నిర్వహణ ఖర్చులు రూ.254 కోట్లు. 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల ఖర్చు రూ.197 కోట్లు. ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున సుమారు రూ.47 కోట్లను అభ్యర్థులకు అందించాం. బహిరంగ సభల కోసం రూ.30 కోట్లు, ప్రకటనల కోసం రూ.75 కోట్లు, క్యాంపెయిన్ కు రూ.42 కోట్లు.. ఇలా మొత్తంగా రూ.197.55 కోట్లు ఖర్చు చేశాం” అని ఆడిట్ రిపోర్టులో బీఆర్ఎస్ వివరించింది.

ఇక ఢిల్లీలో పార్టీ ఆఫీస్ భూమి కోసం రూ.1.78 కోట్లు, భవన నిర్మాణానికి రూ.13.73 కోట్లు.. అద్దె భవనం ఖర్చులు రూ. 1.47కోట్లు, పూణెలో ఆఫీసుకు రూ.14.38 కోట్లు, నాగపూర్ ఆఫీసుకు రూ.8.60 కోట్లు, మధ్యప్రదేశ్ పార్టీ నిర్వహణకు రూ.25 లక్షలు, కోకాపేటలో 11 ఎకరాల భూమి కొనుగోలుకు రూ.7.07 కోట్లు, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రూ.17.10 కోట్లు, అందుకోసం భూముల కొనుగోలుకు రూ.1.21 కోట్లు, ఫర్నీచర్ రూ.26.25 లక్షలు, కంప్యూటర్లు రూ.33.86 లక్షలు, వాహనాలు రూ.3.42 కోట్లు, ఏసీలు రూ.82.73 లక్షలు.. కార్యకర్తల ప్రమాద బీమాకు రూ.25.53 కోట్లు చెల్లించినట్లు పొందుపరిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News