Sunday, June 8, 2025
Homeచిత్ర ప్రభNaresh-Pavithra: ఎట్టకేలకు అధికారికంగా పెళ్లి చేసుకున్న నరేష్-పవిత్ర

Naresh-Pavithra: ఎట్టకేలకు అధికారికంగా పెళ్లి చేసుకున్న నరేష్-పవిత్ర

ఒకప్పటి తెలుగు హీరో ప్రస్తుతం బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్న నరేష్ ఎట్టకేలకు మళ్లీ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న పవిత్రనే ఆయన మనువాడారు. పవిత్ర కన్నడ నటి, తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్న పవిత్ర లోకేష్ మధ్య నరేష్ ప్రేమ, పెళ్లి వివాదం రచ్చ కెక్కినా దేన్నీ ఖాతరు చేయని నరేష్ నాలుగోసారి పెళ్లి చేసుకున్నారు. నరేష్ కు ప్రస్తుతం 63 ఏళ్లు కాగా పవిత్రా లోకేష్ కు 43 ఏళ్లు .

- Advertisement -

ఆమధ్య వీళ్లిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే విషయం లీక్ అయింది. పైగా వీరిపై నరేష్ మాజీ భార్య పదేపదే మీడియాలో మాటల దాడి చేయటం, మైసూరులో వీరిద్దరిపై శారీరకంగా దాడి చేయటం లాంటివి పదేపదే జరగటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News