ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో తొక్కిసలాట(Maha Kumbh Mela Stampede) ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
- Advertisement -
“మహా కుంభమేళా తొక్కిసలాటలో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోవడంతో మరికొంతమంది గాయపడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ విషాద ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందిస్తుంది” అని రేవంత్ రెడ్డి తెలిపారు.