Thursday, January 30, 2025
Homeఇంటర్నేషనల్Trump-Modi budgets: ట్రంప్ ఇచ్చారు మ‌రి మోదీ ఏమంటారు?

Trump-Modi budgets: ట్రంప్ ఇచ్చారు మ‌రి మోదీ ఏమంటారు?

ఇప్ప‌టికే ఎక్కువ ప‌న్ను క‌డుతున్నాంటున్న ఉద్యోగులు

అమెరిక‌న్ పౌరులంద‌రికీ ఆదాయ‌ప‌న్ను నుంచి పూర్తి మిన‌హాయింపు ఇచ్చేందుకు అమెరికా కొత్త అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధ‌మ‌వుతున్నారు. దానివ‌ల్ల వారికి ఖ‌ర్చుపెట్ట‌గ‌ల ఆర్థిక సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని, ఇది ఆర్థిక వ్య‌వ‌స్థ‌కే మేలు చేస్తుంద‌న్న‌ది ఆయ‌న వ్యూహంలా క‌నిపిస్తోంది. అమెరిక‌న్ల‌కు ఆదాయ‌ప‌న్ను లేక‌పోతే.. వారు ఖ‌ర్చుపెట్టేందుకు చేతిలో ఎక్కువ సొమ్ము ఉంటుంద‌ని, త‌ద్వారా అదంతా మార్కెట్లోకి వ‌స్తుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

- Advertisement -

ఫిబ్ర‌వ‌రి 1న న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. భార‌త‌దేశంలో ఇన్ని సంవ‌త్స‌రాలుగా ఆదాయ‌ప‌న్ను క‌డుతున్న ఉద్యోగ‌వ‌ర్గాలు ఈ బ‌డ్జెట్ మీద కోటి ఆశ‌లు పెట్టుకున్నారు. ఈసారైనా ఆదాయ‌ప‌న్నులో కొన్ని మిన‌హాయింపులు ఇస్తార‌ని ఆశిస్తున్నారు. అలా మిన‌హాయింపులు ఇస్తేనే త‌మ జేబులో కొంత‌యినా డ‌బ్బులు మిగులుతాయ‌ని, అవ‌న్నీ మార్కెట్ల‌కు ఊపు తెచ్చేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను పెంచాల‌ని, అలాగే ఆదాయ‌పన్ను శ్లాబుల‌ను స‌వ‌రించాల‌ని అడుగుతున్నారు. 2025లో కొత్త ప‌న్ను విధానంతో ఆదాయ‌ప‌న్ను శ్లాబుల స‌వ‌ర‌ణ‌ను ఆర్థిక‌మంత్రి ప్ర‌వేశ‌పెడ‌తార‌ని నిపుణులు అంటున్నారు. 2020లో ఈ కొత్త విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టినుంచి అందులోనే మార్పులు చేస్తున్నారు త‌ప్ప పాత విధానంలో ఒక్క‌టంటే ఒక్క మార్పూ చేయ‌లేదు. ఆదాయ‌ప‌న్ను క‌ట్టేవారంద‌రినీ కొత్త విధానంలోకి తీసుకురావ‌డం ద్వారా ఆరోగ్య‌బీమా, ఎన్‌పీఎస్ త‌ప్ప మిగిలిన మిన‌హాయంపుల‌న్నింటినీ పూర్తిగా ర‌ద్దు చేయాల‌న్న యోచ‌న‌లోనే కేంద్రం ఉంది. కానీ ఇలా చేయ‌డం వ‌ల్ల సంప్ర‌దాయంగా ఇన్నాళ్ల నుంచి ప‌న్ను మిన‌హాయింపుల కోసం చేస్తున్న సేవింగ్స్ వేటినీ ప్ర‌జ‌లు చేయ‌రు.

వేత‌న‌ జీవులంటే అలుసా?
ఆదాయ‌ప‌న్ను అనేది ఆదాయం సంపాదిస్తున్న వేత‌న జీవులు అంద‌రి ద‌గ్గ‌ర నుంచి కేంద్రం ముక్కుపిండి మ‌రీ వ‌సూలుచేస్తున్న ప‌న్ను. కేవ‌లం ఉద్యోగాలు చేస్తున్న‌వార‌యితేనే వారికి ఎంత జీతం వ‌స్తోంద‌న్న‌ది నేరుగా తెలిసిపోతుంది కాబ‌ట్టి.. దానిమీద ప‌న్నులు వేస్తున్నారు, ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రై క‌డుతున్నారు కూడా. అదే వ్యాపారాలు చేసుకునేవారు, ఇత‌ర వ‌ర్గాల వారి ఆదాయం ఎంత‌నేది ఎక్క‌డా లెక్క‌కు తేల‌ట్లేదు. దానివ‌ల్ల వారి నుంచి పన్నులు వ‌సూలు చేయ‌డానికి అస‌లు ప్ర‌భుత్వం నుంచి ప్ర‌య‌త్నం అన్న‌దే జ‌ర‌గ‌డం లేదు. అందువ‌ల్ల‌.. ఆదాయ‌ప‌న్ను విష‌యంలో వేత‌న‌వ‌ర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాము క‌ష్ట‌ప‌డి రోజంతా ప‌నిచేస్తే వ‌చ్చే జీతం లోంచి త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌ల్పించ‌కుండానే ప్ర‌భుత్వం అంతంత మొత్తాలు ఎలా తీసేసుకుంటుంద‌ని మండిప‌డుతున్నారు.

ఏం చేయాలి?
ఏడాదికి రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం వ‌చ్చేవారికి ఆదాయ‌ప‌న్ను మినహాయింపులు ఇవ్వాల‌ని వేత‌న జీవులు అడుగుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఈసారి మ‌ధ్య‌త‌ర‌గ‌తి మీద ఆర్థిక భారాన్ని కాస్త త‌గ్గించే యోచ‌న‌లో క‌నిపిస్తోంది కాబ‌ట్టి.. క‌నీసం రూ.15 ల‌క్ష‌ల వార్షిక వేత‌నం వ‌ర‌కు ఎలాంటి పన్ను లేకుండా చూడాలి. ఇప్ప‌టికే ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డం, జీవ‌న‌వ్య‌యాలు విప‌రీతంగా ఉండ‌డం స్కూలు ఫీజులు, ఆస్ప‌త్రి ఖ‌ర్చులు అన్నీ పెరిగిపోవ‌డంతో నెల‌కు ల‌క్ష రూపాయ‌ల జీతం వ‌స్తున్నా ఏ మూల‌కూ స‌రిపోవ‌డం లేదు. కేంద్ర ప్ర‌భుత్వం సీఆరి కొత్త ప‌న్ను శ్లాబులను ప్ర‌వేశ‌పెడుతుంద‌ని అంచ‌నా. ముఖ్యంగా వార్షికాదాయం రూ.15 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌చ్చేవారికి 25% ప‌న్ను శ్లాబు కొత్త‌గా రావ‌చ్చు. ఏడాదికి రూ. 20 ల‌క్ష‌లు, లేదా అంత‌కంటే ఎక్కువ ఉండేవారికి మాత్ర‌మే 30% ప‌న్ను శ్లాబు వ‌ర్తిస్తుందని భావిస్తున్నారు.

అంచ‌నా ప్ర‌కారం ప్ర‌స్తుత‌, కొత్త ప‌న్ను శ్లాబులు ఇలా ఉండొచ్చు..

ప్ర‌స్తుత ప‌న్ను శ్లాబు ప‌న్ను రేటు చెల్లించే ప‌న్ను ప్ర‌తిపాదిత‌ప‌న్ను శ్లాబు ప‌న్ను రేటు చెల్లించే ప‌న్ను
3 ల‌క్ష‌ల వ‌ర‌కు.. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు

3 ల‌క్ష‌లు – 7 ల‌క్ష‌లు 5% 20,000 5ల‌క్ష‌లు – 7 ల‌క్ష‌లు 5% 10,000
7 ల‌క్ష‌లు – 10 ల‌క్ష‌లు 10% 30,000 7ల‌క్ష‌లు – 10 ల‌క్ష‌లు 10% 30,000
10 ల‌క్ష‌లు – 12 ల‌క్ష‌లు 15% 30,000 10ల‌క్ష‌లు – 12ల‌క్ష‌లు 15% 30,000
12 ల‌క్ష‌లు- 15 ల‌క్ష‌లు 20% 60,000 12 ల‌క్ష‌లు – 20 ల‌క్ష‌లు 20% 1,60,000
15 ల‌క్ష‌లపైన‌ 30% 3,00,000 20 ల‌క్ష‌లపైన‌ 30% 1,50,000
మొత్తం చెల్లించే ప‌న్ను 4,40,000 మొత్తం చెల్లించే ప‌న్ను 3,80,000

ప‌లు రంగాల‌కు ఆశ‌లు
కేంద్ర బడ్జెట్ 2025 సమీపిస్తున్నకొద్దీ, అన్ని రంగాలలో అంచనాలు అధికంగా ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5% కంటే తక్కువకు తగ్గించే లక్ష్యంతో ఆర్థిక స్థిరీకరణ కంటే వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థికవేత్తలు కోరుతున్నారు. ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం, కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడం సహా కీలక పన్ను సంస్కరణలు రావాలి. రంగాలవారీగా అంచనాలలో తయారీ రంగానికి మరింత మద్దతు, స్థిరాస్తి రంగానికి పరిశ్రమ హోదా గుర్తింపు, మౌలిక సదుపాయాల పెట్టుబడులు అవ‌స‌రం. జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ద్వారా ఉపాధి కల్పనపై దృష్టి సారించడం, స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

(తెలుగుప్ర‌భ ప్ర‌త్యేక ప్ర‌తినిధి)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News