పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. 30న ఉదయం 11.30 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించి బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ బిజినెస్‌పై కేంద్రం అఖిల పక్షానికి వివరించనుంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడతారు.