తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అసోషియేషన్ (Artists Association of Telugu Television (AATT) కార్యవర్గం ఎన్నికలు ఈ నెల 31న జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎస్ హరి ప్యానెల్ సభ్యులు మేనిఫెస్టో విడుదల చేశారు. తమ జీఎస్ హరి ప్యానెల్ గెలిస్తే తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
వినోద్ బాల ఆధ్వర్యంలో 27 ఏళ్ల క్రితం
టెలివిజన్ కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా వినోద్ బాల గారి ఆధ్వర్యంలో 27 ఏళ్ల క్రితం మా తెలుగు టెలిజవిన్ ఆర్టిస్టు అసోషియేషన్ అసోసియేషన్ ప్రారంభించారు. ఈ అసోసియేషన్‌కు మాత్రమే సొంత బిల్డింగ్ ఉంది.
సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జీఎస్ హరి ప్యానెల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జీఎస్ హరి, జనరల్ సెక్రటరీ అభ్యర్థి భార్గవ గొట్టికొండ, ట్రీజరర్ అభ్యర్థి చెన్నుపాటి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాంజగన్, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులు జీఎస్ శశాంక్, కృష్ణ కిషోర్, ఉమాదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అభ్యర్థులు బ్యాంక్ శ్రీనివాస్, దీప్తి వాజ్పెయి, జాయింట్ సెక్రటరీ అభ్యర్థులు మేక రామకృష్ణ, వికాస్, దీప దుర్గంపూడి, మహిళ ఈసీ మెంబర్స్ అభ్యర్థులు రాగ మాధురి, లిరిష, మహతి రిజ్వాన, లక్ష్మిశ్రీ, ఈసీ మెంబర్స్ అభ్యర్థులు బాలజీ, శివకుమార్ కముని, విజయ్ రెడ్డి, ద్వారకేష్, మురళికృష్ణ రెడ్డి, గోపికర్, మురళికృష్ణ, టీవీ నటీనటులు పాల్గొన్నారు.