Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan: జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Jagan: జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

పరువునష్టం కేసులో వైసీపీ అధినేత జగన్(Jagan) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు(AP Highcourt)లో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని మంత్రి నారాయణ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టును కోరారు. అయితే వరుసగా విచారణకు సమయం అడుగుతున్నారని జగన్ తరపు న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

- Advertisement -

కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుల వెనక అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ పాత్ర ఉందంటూ ఓ పత్రికలో కథానాలు వచ్చాయి. దీంతో తన పరువుకు భంగం వాటిల్లిందని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో నారాయణ దావా వేశారు. దీనిపై విచారణకు హాజరు కావాలంటూ జగన్‌కు కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News