తెలంగాణ రాజధాని హైదరాబాద్లో రేపు(శుక్రవారం) చికెన్ షాపులు(Chicken Shops) మూతపడనున్నాయి. గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. చికెన్ షాపులతో పాటు మటన్ షాపులు కూడా బంద్ చేయాలని ఆదేశించారు. ఎవరైనా ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా గాంధీ జయంతి రోజున ఈ నిబంధనలు పాటిస్తుండగా ఈసారి ఆయన వర్థంతి రోజున కూడా ఈ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు.