Thursday, January 30, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi January 30th Episode: అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మూడు నెలలు టైం అడిగిన...

Brahmamudi January 30th Episode: అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మూడు నెలలు టైం అడిగిన కావ్య..

ఈరోజు సీరియల్‌లో కళ్యాణ్ నాకు ఆస్తి వద్దు, ఈ ఇంటి వారసత్వం కావాలి, నా పేరు మీద మీరు ఎవరు కోర్టులో కేసు వేయడానికి నిలదీస్తాడు. అందరూ కలిసి ఉన్న కుటుంబాన్ని విడదీయాలని మీకు ఎందుకు అనిపిస్తుందని అడుగుతాడు. ఆస్తి మీద ఆశలు ఎక్కువయిపోయాయా, అంత దిగజారిపోయారా అంటాడు.
ఆ మాటలకు ఇందిరా దేవి చాలు రా ఈ జన్మకి మీ అమ్మా, నాన్న చేసిన పనికి నువ్వు చెప్పిన సమాధానంతో నాకు కడుపు నిండి పోయింది నా ఆయుషు కుడా నువ్వే పోసుకుని బతకాలి అని దీవిస్తుంది.

- Advertisement -

అప్పుడు ధాన్యలక్ష్మి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి ఈ కావ్య ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టేసి నాశనం చేస్తుంది ఇలా చేస్తే ఎవరు అడుగుతారు ఇంక మనకి ఏమి మిగులుతుంది అని అడుగుతుంది. దానికి కళ్యాణ్ వదిన ఏమి చేసినా ఆలోచించే చేస్తుంది ఏమి చేసినా అన్నయ్యకు తెలియకుండా చేయదు నాకు నమ్మకం ఉంది ఎవరికి ప్రశ్నించే హక్కు లేదు అంటాడు. ఆతర్వాత కావ్య మీ అందరి ప్రశ్నలకు ఏదొక రోజు సమాధానం ఇస్తాను మూడు నెలలు సమయం ఇవ్వండి ఈలోపు అన్ని మీకే తెలుస్తాయి అని చెప్తుంది.

అక్కడ రూమ్‌లో ధాన్యలక్ష్మి అన్నీ పగలకొట్టేస్తూ ఓ రెచ్చిపోతుంది. అక్కడికి రుద్రాణి వచ్చి పొద్దున్న వెళ్లి సాయంత్రం వచ్చేసరికే మొత్తం మార్చేసారు. ఇక మూడు నెలలు టైం ఇస్తే ఇక అంతే సంగతులు అని రెచ్చగొడుతుంది. ధాన్యలక్ష్మి మాత్రం టైం ఇస్తాను అని నేను నీతే చెప్పానా నేను చేయాల్సింది చేస్తాను అంటుంది. రుద్రాణి, రాహుల్ ఇంకా ప్లాన్‌లు వేస్తారు.

మరోవైపు రాజ్ కావ్యని నువ్వు కళ్యాణ్ని పిలిచిన విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. మీరు టెన్షన్ పడుతారు అని చెప్పలేదు అంటుంది కావ్య. ఆ తర్వాత ఇద్దరూ గోల్డ్ డిజైన్స్ చూడటానికి జితేంద్ర వస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుని అవి రెడీ చేయించలేదని ఇద్దరూ గొడవ పడుతారు.

మరోవైపు అపర్ణ టెన్షన్ పడుతుంటే సుభాష్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందిగా ఇంకెందుకు అలా ఉన్నావు అంటే ఎక్కడ పరిష్కారం దొరికింది కావ్య ఇంకా మూడు నెలలు టైం అడిగింది కానీ సమస్య ఏంటో చెప్పలేదు అని కంగారు పడుతుంది. సుభాష్ మనకు చెప్పేంత విషయం కాదు ఏమో వాళ్లే చూసుకుంటారులే అందుకే కావ్య ఏ కళ్యాణ్ ని ఇంటికి వచ్చేలా చేసింది. నాకు నా కోడలిపైన రాజ్‌పైన నమ్మకం ఉంది. వాళ్లే అన్నీ చూసుకుంటారు, నువ్వు ప్రశాంతంగా ఉండు అంటాడు. ఇక రాజ్ కావ్యలు డిజైన్స్ చూస్తూ ఇద్దరికి ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News