ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళలో(Maha Kumbh Mela) తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రధాని మోదీతో సహా ఇతర రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ విచారణకు ఆదేశించిన యోగి సర్కార్.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వయంగా ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు.
కాగా బుధవారం మౌని అమావాస్య కావడంతో అమృత స్నానం ఆచరించేందుకు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున భక్తులు గుమికూడటంతో కొందరు బారికేడ్లను తోసేశారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.