Sunday, June 22, 2025
Homeఇంటర్నేషనల్Plane Crash: అమెరికాలో విమానం- హెలికాఫ్టర్ ఢీ.. బాధితులకు హైపోథెర్మియా ముప్పు

Plane Crash: అమెరికాలో విమానం- హెలికాఫ్టర్ ఢీ.. బాధితులకు హైపోథెర్మియా ముప్పు

అమెరికా(America)లోని రొనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం(Plane Crash) జరిగింది. ఓ విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ గాల్లోనే ఓ ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో పెద్ద శబ్దంతో రెండూ పేలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

- Advertisement -

పోటోమేక్ నదిపై ఈ ఘటన జరగడంతో విమాన, హెలికాప్టర్ శకలాలు అందులో పడిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణ బాధితులకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నదిలో ఉష్ణోగ్రతలు -1 నుంచి -2 సెల్సియస్‌ వరకు ఉండొచ్చని అమెరికా నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ పేర్కొంది. దీంతో బాధితుల శరీరాలు కోల్డ్‌ షాక్‌కు గురికావచ్చని నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా హైపర్‌ రీవెంటిలేషన్‌ వంటి పరిస్థితి తలెత్తొచ్చని తెలిపింది. అదే నీటిలో ఎక్కువ సేపు ఉంటే హైపోథెర్మియాకి గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News