Thursday, January 30, 2025
HomeతెలంగాణPhone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్‌

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు తెలంగాణ హైకోర్టు(TG Highcourt) బెయిల్‌ మంజూరైంది. రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు, పాస్‌పోర్టులు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ట్రయల్ విచారణకు పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించింది.

- Advertisement -

కాగా ఈ కేసులో ఏ4 నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్నకు ఇటీవల సుప్రీంకోర్టు(Supreme Court) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News