నేటి నుంచి మాఘ మాసం ప్రారంభం కావటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బజాలు మోగనున్నాయి. ఇక ఈ నెల 31 నుంచి మార్చి 16 వరకు మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఉగాది పండుగ తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలలో ముహూర్తాలు ఉన్నాయన్నారు.
ముహూర్తాల వివరాలు ఇలా
ఫిబ్రవరి నెలలో 2,3,7,13,14,15,18,19,20,21,23,25
మార్చి నెలలో 1, 2, 6, 7,12
ఏప్రిల్ నెలలో 14,16,18,19, 20, 21, 25, 29, 30
మే నెలలో 1, 5, 6, 8,15, 17, 18
జూన్ నెలలో 1, 2, 4,7
వేల మందికి ఉపాధి
పెళ్లిళ్ల సందడి మొదలవటంతో 20 నుంచి 25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చేతి నిండా పని దొరకనుంది. వచ్చే రెండు నెలల్లో సగానికి పైగా రోజులు వివాహాలకు కళ్యాణ మండపాలు ముందస్తుగా బుకింగ్ అయ్యాయి.
రద్దీగా మారనున్న వస్త్ర దుకాణాలు
పురోహితులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, క్యాటరింగ్, వస్త్ర వ్యాపారులు, బంగారం, వెండి వ్యాపారాలు, అలంకరణ మొదలైన వాటికి ఈ పెళ్లిళ్ల సీజన్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే వస్త్రదుకణాల్లో ప్రజలు బారులు తీరి షాపింగ్ చేస్తున్నారు.