Friday, January 31, 2025
Homeనేషనల్All Party Meeting: రేపటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు.. అఖిలపక్షం భేటీ

All Party Meeting: రేపటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు.. అఖిలపక్షం భేటీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) రేపు(శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం(All Party Meeting) నిర్వహించారు. ఈ భేటీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నుంచి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్… కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్, గౌరవ్ గొగోయ్.. ఇతర పార్టీల నుంచి టీఆర్ బాలు, డెరిక్ ఒబ్రెయిన్, పలువురు ఎంపీలు హాజరయ్యారు.

- Advertisement -

కాగా కేంద్ర బడ్జెట్ తొలి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇక ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News