ఈరోజు ఎపిసోడ్లో కావ్య వేసిన స్పెషల్ డిజైన్‌ను ఆక్షన్‌లో అమ్మడానికి చూస్తారు. కావ్య తయారు చేసిన డిజైన్‌ను ఎంతకు అమ్ముడవుతుందనుకుంటున్నావు అంటే 25 లక్షల రూపాయిలు అని అంటుంది. రాజ్ చూస్తా ఉండు ఒక బిజినెస్ మ్యాన్‌లా దాని వాల్యూ ఎంత పెంచుతానో అంటాడు. అలా ఆ నెక్లెస్‌ను వేలంలో 2.2 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయేలా చేస్తాడు. అప్పుడు కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట అండ రూ.25లక్షలది 2 కోట్లకు అమ్మారు అని అంటుంది. మరీ రాజ్ అంటే ఏం అనుకున్నవ్ అంటాడు రాజ్. మీరే గ్రేట్ ఒప్పుకున్నాను వచ్చేనెల ఈఎంఐలకు అయినా పనికొస్తాయి అంటుంది.
మరోవైపు స్వప్న తన ఆస్తులపై వచ్చే అద్దెలు తీసుకునే పనిలో ఉంటుంది. రూ.2 లక్షలు ఇప్పుడే వేసాము అని వాళ్లు చెప్తే సరే అని ఫోన్ పెట్టేస్తుంది ఆ మాటలు విన్న రుద్రాణి, రాహుల్ ఆ డబ్బులు ఎవలా అయినా లాగేయాలని చూస్తారు. అప్పుడు క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవాలి అని రూ.40 వేలు అడిగితే ఇవ్వను అంటుంది స్వప్న. అప్పుడు రాహుల్ వెదవ తెలివితేటలు వాడ స్వప్న ఫోన్‌కి ఫేక్ లింక్ పంపించిరూ.2 లక్షలు కొట్టేస్తాడు. దాంతో స్వప్న రాహుల్‌కి చెప్తే ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ క్లిక్ చెయ్యకూడదని సలహా ఇస్తాడు. ఆ మాటలకు డబ్బులు దొబ్బేసింది వాళ్లే రోజులు అని తెలుసుకొని మీ సంగతి చెప్తాను అంటుంది.
మరోవైపు రాజ్ ఫ్రెండ్ వచ్చి మీ డిజైన్స్ అమెరికా కాంట్రాక్ట్ వాళ్లకి నచ్చాయి మీరు ఇంకో నెలలో అక్కడికి వెళ్లి ప్రమోట్ చెయ్యాలని చెప్తాడు. అప్పుడు కావ్య ఆనందంతో అప్పుడే అమెరికా వీదుల్లో విహరిస్తుంది. నేను అమెరికా వెళ్తున్న అంటూ ఓ ఆనంద పడుతూ డ్యాన్స్ చేస్తుంది. కంగారు పడకు నీకు ఇంకా వీసా రావాలి అంటాడు కావ్య మాత్రం 30 రోజుల్లో ఇంగ్లీషు ఎలా నేర్చుకోవాలి అని ఆలోచిస్తుంది.
మరోవైపు స్వప్న రాహుల్, రుద్రాణి దగ్గరకు క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవాలి ఒక రూ.50 వేలు ఇవ్వండి అంటుంది. వాళ్లు ఇవ్వము అని అంటారు. రాహుల్ ఫోన్ చూసుకుంటే డబ్బులు పోయాయి అని మెసెజ్ వస్తుంది. అప్పుడు స్వప్న ఆనందంతో వచ్చి బాగా అయిందా అంటుంది. ఆ స్కామ్ చేసింది స్వప్ననే అని తెలిసిన అంతకముందు వాళ్ళు అదే పని చేశారని ఏం మాట్లాడలేక సైలెంట్ ఉండిపోతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.