అల్లూరి జిల్లాలోని అరకు లోయలో చలి ఉత్సవం(Araku Chali Utsav) ప్రారంభమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ రైడ్ నిలవనుంది. హెలికాప్టర్‌లో అరకు అందాలను తిలకించే అవకాశం ఉంది.
ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లలకు రూ.2,000.. పెద్దలకు రూ.4,000 చొప్పున ధర నిర్ణయించారు. అలాగే కొత్తవలస ఉద్యానంలో పారా మోటార్ గ్లైడింగ్ ఏర్పాటు చేశారు. పద్మాపురం బొటానికల్ గార్డెన్స్‌లో ఫ్లవర్ షోతో పాటు పెయింటింగ్ పోటీలు, గిరిజన కళాకారుల నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇక శనివారం ఉదయం సైక్లింగ్ ఈవెంట్.. సాయంత్రం ఫ్యాషన్ షో ఉంటుంది. ఆదివారం ఉదయం సుంకరమెట్ట కాఫీ తోటల నుంచి అరకు ట్రెక్ ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.