హెలికాప్టర్ ఎక్కి ఎంచక్కా గాలిలో ఎగరాలని ఎవరికైతే ఆశ ఉండదు. అయితే ఈ కోరిక నెరవేరాలంటే మాత్రం ఎక్కువగా డబ్బులు ఉండాలని అనుకుంటారు. కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టూరిస్టులకు తక్కువ ధరకే ఈ సదావకాశాన్ని కల్పిస్తోంది. అది కూడా ఎక్కడో కాదు మన శ్రీకాకుళంలోనే. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
ఈ మధ్య కాలంలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథసప్తమి వేడుకను రాష్ట్ర పండుగలా నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2,3,4 నుంచి ఇది అమలు కానుంది. అందులో భాగంగానే ఈ హెలికాప్టర్ టూరిజం రైట్స్ ను ఏపీ టూరిజం వారు ఏర్పాటు చేస్తున్నారు.
పర్యాటకుల క్యూ
హెలికాప్టర్ లో తిరిగే గొప్ప అవకాశం కల్పించటంతో పర్యాటకులు శ్రీకాకుళంకి క్యూ కట్టే అవకాశం ఉంది. పైగా రథ సప్తమి రాష్ట్ర పండగగా నిర్వహించనున్నారు. దీంతో పెద్ద ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హెలికాప్టర్ లో తిరగాలంటే రూ.1800 చెల్లించాలి..
ఈ హెలికాప్టర్ లో తిరిగేందుకు రూ.1800 ఫీజును ఏర్పాటు చేశారు అధికారులు. టూరిజం రైడ్ మొత్తం 10 నిమిషాల పాటు ఉంటుందని చెప్పారు. శ్రీకాకుళం ఏరియల్ వ్యూను ఈ హెలికాప్టర్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పారు.
ఒక రైడ్ లో ఫ్యామీలి వెళ్లచ్చు..!!
ఈ హెలికాప్టర్ ఓ ఆరుగురు వెళ్లాలే ఏర్పాటు చేశారు. ఒక్కో రైడులో ఈ ఆరుమంది కలిసి ప్రయాణించే సద్గుపాయం కల్పించనున్నారు. హెలికాప్టర్ రైడ్ కి సంబంధించి టికెట్స్ ఏపీ టూరిజం శ్రీకాకుళం వారి దగ్గర అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు
విద్యార్థులకు బంపర్ ఆఫర్
అరిసవెల్లి రథసప్తమి ఉత్సవాలలో భాగంగా శ్రీకాకుళం జడ్పీహెచ్ హాల్లో ఫిబ్రవరి 1న సాయంత్రం 4 గంటలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో విజేతలుగా మొదటి మూడు స్థానాలు వచ్చిన వారికి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలసి హెలికాప్టర్లో ప్రయాణించే ఉంటుందని అధికారులు తెలిపారు.
ప్రముఖ టూరిస్టు స్పాట్స్ కోసం ప్రత్యేక ఆఫర్
రథసప్తమి ఉత్సవాల్లోనే భాగంగా శ్రీకాకుళంలోని సందర్శనీయ ప్రదేశాలను రూ.750లతో చూసేలా ఏర్పాటు చేశారు ఏపీ టూరిజం అధికారులు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీలలో ఇందుకోసం ఓ మినీ బస్సును ఏర్పాటు చేయనున్నారు. ఈ బస్సు ద్వారా శ్రీకూర్మం, నకదలపాడు, సాలి హుండం, శ్రీ ముఖలింగం రావివలస చూడచ్చు. శ్రీకాకుళం ఏపీ టూరిజం కౌంటర్ దగ్గర ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.