అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ డీసీ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న విమానం, ఆర్మీ హెలికాప్టర్(Plane-Helicopter Crash) ఢీకొట్టడంతో నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
- Advertisement -
‘వాషింగ్టన్ డీసీలో జరిగిన ఘోర ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం నన్ను ఎంతో బాధించింది. మృతులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అమెరికా ప్రజలకు సంఘీభావంగా నిలబడతాం’ అని తెలిపారు.