Friday, January 31, 2025
HomeతెలంగాణGBS Virus: తెలంగాణకు పాకిన గులియన్ బారే సిండ్రోమ్

GBS Virus: తెలంగాణకు పాకిన గులియన్ బారే సిండ్రోమ్

మహారాష్ట్రలో ఆందోళన కలిగిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్(GBS Virus) తెలంగాణకూ పాకింది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఇది అంటువ్యాధి కాదని చికిత్సతో నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -

కాగా మహారాష్ట్రలో ఇప్పటికే వందల్లో జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సిండ్రోమ్ బారినపడే అవకాశం ఉంది. ఇది సోకిన వారిలో ఒళ్లంతా తిమ్మిర్లు, కండరాలు బలహీనంగా మారుతాయి. డయేరియా, పొత్తికడుపులో నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదముందని.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News