Friday, January 31, 2025
Homeనేషనల్Parliament Budget Session: బడ్జెట్ సమావేశాల్లో..రాష్ట్రపతి ముర్ము ప్రసంగం..

Parliament Budget Session: బడ్జెట్ సమావేశాల్లో..రాష్ట్రపతి ముర్ము ప్రసంగం..

శుక్రవారం ఉదయం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు (Parliament Budget Session) ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. ముందుగా ద్రౌపదీ ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.

- Advertisement -

పార్లమెంట్ సమావేశాలను మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో ప్రారంభించుకుంటున్నామని అన్నారు. జనవరి 26న గణతంత్ర వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యత ఉంటుందని ఆమె ప్రసంగంలో తెలిపారు.

ముఖ్యమైనా పాయింట్స్

గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు మూడు రెట్లు వేగంతో పనిచేస్తోందన్నారు. త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారనుందన్నారు.పేదరిక నిర్మూలక కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
సొంతటి కల నెరేవేరుస్తున్నాం
మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నామన్నారు. అదనంగా3 కోట్ల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను పొడిగించామన్నారు.

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం
ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన 6 కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తోందన్నారు. అమృత్ భారత్‌, నమో భారత్‌ రైళ్లు ప్రవేశపెడుతున్నామన్నారు. విద్యా రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందన్నారు. యువతకు నూతన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.

ఒకే దేశం-ఒకే ఎన్నిక
ఒకే దేశం-ఒకే ఎన్నిక, వక్ఫ్‌ సవరణ బిల్లు అమలు దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News