దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) రంజీ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో కోహ్లీ బ్యాటింగ్ చూద్దామనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలింది. బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్.. 15 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. రైల్వేస్ బౌలర్ సాంగ్వాన్ వేసిన బంతికి అఫ్ స్టంప్ ఎగిరిపడింది. దీంతో పెవిలియన్ బాట పట్టాడు. ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరడంతో కోహ్లీ బ్యాటింగ్ కోసం వేలాదికి స్టేడియానికి తరలివచ్చిన ఫ్యాన్స్ నిరాశతో మైదానంన బయటకి వెళ్లిపోయారు.
కాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్ జట్టుతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తరఫున విరాట్ కోహ్లీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బందులు పడుతున్న కోహ్లీ తిరిగి ఫామ్ అందుకునేందుకు రంజీ మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు బీసీసీఐ కూడా జాతీయ జట్టులో ఆడే ప్రతి ఆటగాడు తప్పనిసరిగా రంజీ మ్యాచ్‌లు ఆడాలని సూచించింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు 241 రన్స్‌కు ఆలౌట్ అయింది. ప్రస్తుం ఢిల్లీ 104/4 పరుగులు చేసింది.