Friday, January 31, 2025
Homeనేషనల్Droupadi Murmu: రాష్ట్రపతి వచ్చిన గుర్రపు బగ్గీ ఎలా భారత్ చేతికొచ్చిందో తెలుసా..?

Droupadi Murmu: రాష్ట్రపతి వచ్చిన గుర్రపు బగ్గీ ఎలా భారత్ చేతికొచ్చిందో తెలుసా..?

బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్‌లో ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు సంప్రదాయ గుర్రపు బుగ్గీలో(Horse Drawn Buggy) రావడం ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు ఇటీవల నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా ఆమె ఈ గుర్రపు బగ్గీలోనే వచ్చారు. ఆరు గుర్రాలు ఉండే ఈ బగ్గీకి బంగారు పూత పూసిన అంచులు ఉంటాయి. ఎరుపు వెల్వెట్ ఇంటీరియర్‌తో పాటు అశోక చక్రం కలిగి ఉంటుంది.

- Advertisement -

ఈ బగ్గీ చరిత్ర తెలుసుకోవాలంటే బ్రిటీష్ కాలానికి వెళ్లాల్సిందే. ఆరు గుర్రాలు లాగే ఈ బండిని బ్రిటీషర్ల కాలంలో భారత వైశ్రాయి వాడేవారు. అనంతరం స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారత్-పాకిస్థాన్ విడిపోయేటప్పుడు ఈ బగ్గీ ఎవరికీ చెందాలనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు దీని కోసం టాస్ వేశాయి. భారత్‌కు చెందిన కల్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్, పాక్‌కు చెందిన సహబ్జాదా యాకూబ్ ఖాన్ ఈ టాస్‌ వేశారు. టాస్ భారత్ గెలవడంతో అప్పటి నుంచి ఈ బగ్గీ ఇండియా సొంతమైంది.

అప్పటి నుంచి 1984 గణతంత్ర వేడుకల వరకు దీన్ని రాష్ట్రపతి వినియోగించేవారు. కానీ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం భద్రతా కారణాల వల్ల దీని వినియోగాన్ని ఆపేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడంతో 2014, 2016లో అప్పటి రాష్ట్రపతి దివంగత ప్రణబ్‌ ముఖర్జీ ఈ బగ్గీలోనే బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమానికి వెళ్లారు. ప్రస్తుతం ద్రౌపది ముర్ము దీనిని వాడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News