అండర్-19 మహిళల ప్రపంచకప్ 2025(U-19 World Cup) రెండో సెమీస్లో భారత్, ఇంగ్లండ్(IND Vs ENG) జట్ల మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్ జోరు కొనసాగుతోంది. గ్రూప్ దశ నుంచి అపజయమే లేకుండా సెమీస్ చేరుకుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి ఫైనల్ చేరాలని పట్టుదలతో ఉంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తొలి సెమీస్లో సౌతాఫ్రికా జట్టు విజయం సాధించి ఫైనల్ దూసుకెళ్లింది.
భారత్ జట్టు: నికీ ప్రసాద్ (C), కమలిని(WK), గొంగడి త్రిష, సనికా చల్కే, ఐష్వరి, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత, షబ్నమ్ షకిల్, పరునికా సిసోదియా, వైష్ణవి శర్మ
ఇంగ్లండ్ జట్టు: అబీ నారోగ్రోవ్ (C), డేవినా సారా పెర్రిన్, జెమీమా స్పెన్స్, ట్రుడే జాన్సన్, స్టబ్స్, కేటీ జోన్స్ (WK), ప్రిషా, టిల్లే, ఛార్లెట్ లాంబెర్ట్, సురేంకుమా, ఫోబ్ బ్రెట్