పార్లమెంట్ బడ్జెట్(Union Budget) సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అంతకుముందు ప్రధాని మోదీ(PM Modi) కూడా జాతిని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ఉభయ సభలు సక్రమంగా జరిగేలా సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
ఇక రాష్ట్రపతి ప్రసంగం అనంతరం 2024-25 ఆర్థిక సర్వే (Economic Survey 2024-25)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను శనివారానికి వాయిదా వేశారు. రేపు (శనివారం) కేంద్ర బడ్జెట్‌ను నిర్మల సభలో ప్రవేశపెట్టనున్నారు.
కాగా బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరుతో పాటు రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసేదే ఈ ఆర్థిక సర్వే. 1960 నుంచి బడ్జెట్‌కు ఒకరోజు ముందు ఈ సర్వే సభలో ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది.