Friday, January 31, 2025
HomeAP జిల్లా వార్తలుతిరుపతిTirumala: ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం

Tirumala: ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం

- Advertisement -

తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పాట్లపై సమావేశం నిర్వహించింది టీటీడీ. పాలకమండలి నిర్ణయాలును టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు.


రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సమావేశం
ఫిబ్రవరి 4 వ తేది జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సమావేశం నిర్వహించామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. సప్త వాహనాలపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగి దర్శన భాగ్యం ఇస్తారని చెప్పారు.

రథసప్తమి నాడు 6.44 కు సూర్యోదయ గడియలు
రథ సప్తమి రోజు ఉదయం 6 గంటల 44 నిమిషాలకు స్వామి వారిని సూర్య కిరణాలు తాకుతాయని చెప్పారు. ఆ రోజున ఈ వేడుకలను చూసేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తారని చెప్పారు. 2 లక్షల మంది వస్తారని అంచనా వేసామని చెప్పారు.

ఈ సేవలు రద్దు
రథసప్తమి నాడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశామని చెప్పారు. టైం స్లాట్ టికెట్స్ 3-5 వరకు రద్దు చేశామని అన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శన భాగ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు.

కట్టుదిట్టమైనా భద్రతా చర్యలు
రథసప్తమి సందర్భంగా కట్టుదిట్టమైనా భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు ఛైర్మన్. 1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. పార్కింగ్, అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నార. గ్యాలరీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

గజ ఈతగాళ్లను నియమించాం
చక్రస్నానా సమయంలో పుష్కరిణిలో గజ ఈతగాళ్లను నియమించామన్నారు. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు వితరణ చేయనున్నట్లు తెలిపారు. ఆలయ మాడ వీధుల్లో చలవపందిళ్లు వేశామన్నారు.

8 లక్షల లడ్డూలు
భక్తుల సౌకర్యార్థం 8 లక్షల లడ్డూలు అందుబాటులో పెడుతామన్నారు. తిరుమలను విద్యుత్, పుష్పాలంకరణతో అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతామన్నారు.

ఉద్యోగి కోసం ప్రత్యేక గాలింపు
తప్పిపోయిన ఉద్యోగి కోసం టీటీడీ విజిలెన్స్, యూపీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు తప్పిపోయిన ఉద్యోగి కోసం టీటీడీ విజిలెన్స్, యూపీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కార్మికుల జీతాలు పెంపు
అలిపిరి వద్ద నిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తామని చెప్పారు.భక్తులు తమకు ముఖ్యమైన రోజుల్లో హోమంలో స్వయంగా పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. టీటీడీలో పనిచేసే 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల జీతాలను 12 వేల నుంచి 17 వేలకు పెంపు చేస్తామన్నారు.


ఉద్యోగుల జీతాలు పెంపు
తితిదే పరిధిలోని కార్పొరేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3% పెంచేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్పొరేషన్‌లో పని చేసే ఉద్యోగులు ఆకాల మరణం పొందితే వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు చేస్తారన్నారు.కార్పొరేషన్‌లో పని చేస్తూ ఈఏస్ఐ వర్తించని ఉద్యోగులకు హెల్త్ స్కీం వర్తింపజేస్తామన్నారు.


రోడ్లకు ప్రత్యేక ప్రాధాన్యత
నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్టుమెంట్ల ఏర్పాటుకు రూ.18 కోట్లు కేటాయించమన్నారు. నారాయణగిరిలో హోటల్స్‌, అన్నమయ్య భవన్‌లో హోటల్స్‌ను టూరిజం శాఖకు అప్పగిస్తామన్నారు. ఆకాశ గంగ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రూ. 40 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నామన్నారు. వరాహస్వామి అతిథి గృహం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రూ.10.8 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు.

మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ
తిరుపతిలో తితిదే అనుబంధ ఆలయాలు, భక్తులు సంచరించే ప్రాంతాలలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఆ బాధ్యతలను తితిదే పరిధిలోకి తీసుకొస్తాం. పురాతన ఆలయ గోపురాల నిర్వహణ పర్యవేక్షణకు నిపుణులతో కమిటీ ఏర్పాటు.తిరుపతిలోని చెర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు రూ.25 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు.

డీజేలకు బదులు లలిత గీతాలు
టీటీడీ పరిధిలోని పాఠశాల విద్యార్థులుకు నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. టీటీడీ కల్యాణ మండపాలలో వివాహాల సందర్భంగా DJలకు బదులుగా లలిత గీతాలు పాడుకోవడానికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News