ప్రపంచ పర్యాటక మ్యాపులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గండికోట (Gandikota) పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుండగా.. మరోవైపు ఒబేరాయ్ సంస్థ ఆతిధ్య సేవల కోసం సిద్ధమవుతోందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో గండికోట పర్యాటక అభివృద్ధిలో భాగంగా సుప్రసిద్ధ ఒబేరాయ్ హోటల్ (oberoi hotels) నిర్మాణానికి సంబంధించి ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ నహర్ జీ, సంబంధిత ప్రాజెక్టు అభివృద్ధి ఏజెన్సీలతో కలిసి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రం”కు అతి చేరువలోనే జాతీయ రహదార్లు, రైలు మార్గం, విమానయాన రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇన్ని సదుపాయాలతో భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఆ దిశగా ఇప్పటికే గండికోట డెవెలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం జరుగుతోందన్నారు.
మరోవైపు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తూ అధునాతన, విలాసవంతమైన, ఉల్లాసభరితమైన సదుపాయాలతో.. స్టార్ హోటళ్ల సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు పర్యాటకం, హాస్పిటాలిటీ రంగంలో ప్రతిష్టాత్మకమైన ఒబేరాయ్ సంస్థ ప్రణాళికలు రూపొందించిందన్నారు. అందులో భాగంగానే ఆ సంస్థ ప్రతినిధులు, ప్రాజెక్టు కన్సల్టెంట్ ఏజెంట్లతో సమీక్షించడం జరిగిందన్నారు.
ఒబేరాయ్ హోటల్స్ ఏర్పాటులో భాగంగా… ఆ సంస్థ చేపట్టే నిర్మాణాల వివరాలు, మౌలిక సదుపాయాలైన రోడ్లు, హెలిప్యాడ్, రిసార్ట్ భవనాలను నిర్మించనున్నారు. వీటితో పాటు పర్యటకంలో ప్రత్యేక ఆకర్షణనిచ్చే వ్యూ పాయిట్స్, వివిధ రకాల క్రీడా ప్రాంగణాలు, జిమ్, స్విమ్మింగ్ ఫూల్, రెస్టారెంట్, చిల్డ్రన్ ప్లే జోన్, ల్యాండ్ స్కెపింగ్, లైటింగ్, సీటింగ్, లాంటి రిజర్వాయర్ లో వాటర్ జెట్టీలు, బోటింగ్ వంటి సదుపాయాల కల్పన కోసం రూపొందించిన ప్రణాళికలను ప్రపంచ పర్యాటక మ్యాపులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గండికోట పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుండగా మరోవైపు ఒబేరాయ్ సంస్థ ఆతిధ్య సేవల కోసం సిద్ధమవుతోందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో గండికోట పర్యాటక అభివృద్ధిలో భాగంగా సుప్రసిద్ధ ఒబేరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ నహర్ జీ, సంబంధిత ప్రాజెక్టు అభివృద్ధి ఏజెన్సీలతో కలిసి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షా సమావేశం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఒబేరాయ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ వివరించారు. అనంతరం సంబందిత అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.