అండర్-19 మహిళల ప్రపంచకప్ 2025(U-19 World Cup) రెండో సెమీస్లో ఇంగ్లండ్తో(IND Vs ENG) జరిగిన భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లీష్ బ్యాటర్లలో డేవినా సారా (45), అబి నోర్గ్రోవ్ (30) లు రాణించారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, పరునికా చెరో మూడు వికెట్లు తీశారు. ఆయుషి రెండు వికెట్లు తీశారు.
అనంతరం 114 పరుగుల తక్కువ లక్ష్యంతో బరిలో భారత జట్టు 15 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి టార్గెట్ ఛేదించింది. భారత బ్యాటర్లలో కమలిని (56) హాఫ్ సెంచరీ చేయగా.. తెలుగు యువతి గొంగడి త్రిష (35) పరుగులతో మరోసారి రాణించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక ఫిబ్రవరి 2న జరగనున్న తుది పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది.