Friday, January 31, 2025
Homeనేషనల్AAP: కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా..!

AAP: కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ, ప్రతిపక్షాలు బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు గెలుపు కోసం సర్వవక్తులు ఒడ్డుతున్నాయి. ఒకవైపు ప్రచారాన్ని ఉధృతం చేస్తూనే.. హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆప్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో పార్టీ శిబిరంలో ఆందోళన రేగింది.

- Advertisement -

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు నరేశ్ యాదవ్ (మెహ్రౌలి), రోహిత్ కుమార్ (త్రిలోక్పురి), రాజేశ్ రిషి (జనక్పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్), భావనా గౌడ్ (పాలం). బీఎస్ జూన్ (బిజ్వాసన్). గా తెలుస్తోంది. వీరంతా తమ రాజీనామా లేఖను పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు పంపారు. తమకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమపై నమ్మకం పోయింది అంటూ వాపోయారు.

అధికార పార్టీకి చెందిన ఈ ఏడుగురు కీలక ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఎన్నికల సమీకరణాలు మారిపోయాయి. అయితే ఈ పరిణామం ఆప్ కు భారీ దెబ్బని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లే అవకాశముందా.. లేక కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా.. అనే అంశం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. బీజేపీ ఇప్పటికే ఆప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. ప్రజల మద్దతును ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది.

ఈ రాజీనామాలు ఎన్నికలపై ఎంతటి ప్రభావం చూపుతాయనేది కీలకం. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వం తన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేష ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఎన్నికల ముందు ఇలా కీలక ఎమ్మెల్యేలు వైదొలగడం ఆప్‌కు భారీ షాక్ ఇచ్చినట్లే. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ఆప్ పార్టీ ఎలా స్పందిస్తుంది..? ప్రజల మద్దతును ఎలా కాపాడుకుంటుంది.. అనేది వేచి చూడాలి. ఢిల్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారినట్లు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News