Friday, October 18, 2024
HomeతెలంగాణHyd: శ్రేణులకు కేసీఆర్ చేసిన దిశా నిర్దేశం ఇదే

Hyd: శ్రేణులకు కేసీఆర్ చేసిన దిశా నిర్దేశం ఇదే

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పలు కార్పోరేషన్ల ఛైర్మన్ లు, మేయర్ లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు తదితరులు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. వీరికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని బిజెపి పార్టీ ఓర్వలేకపోతూ, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వేధిస్తున్నట్టు కేసీఆర్ ఆరోపించారు. ఇప్పటికే బీఆర్ఎస్ మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని సిబిఐ, ఐటి, ఈడి దాడులతో తప్పుడు ఆరోపణలతో బీజేపీ వేధిస్తుండగా వాటిని తిప్పికొడతామన్నారు.

- Advertisement -

ఆత్మీయ సమ్మేళనాలు..
ప్రతీ పది గ్రామాలను యూనిట్ గా తీసుకొని ఎమ్మెల్యేలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని, ఈ సమ్మేళనాల్లో స్థానిక ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, కార్పోరేషన్ ఛైర్మన్ లను డిసిసిబి, డిసిఎంఎస్ తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలని ఇదంతా రెండునెలల్లో పూర్తీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రజల్లోనే ప్రజాప్రతినిధులు ఉండాలన్నారు.
ఏప్రిల్ 30న సెక్రెటేరియట్ ప్రారంభోత్సవం

ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. పల్లె ప్రగతి-పట్టణ ప్రగతి, అంబేద్కర్ విగ్రహావిష్కరణ, పార్టీ ఆవిర్భావ దినోత్సవం భారీ సభలు వంటివన్నీ వరుసపెట్టి నిర్వహించి, బీఆర్ఎస్ భారీ కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్టు సీఎం వివరించారు. పేదలకు అందే పథకాల్లో అవినీతి జరిగితే క్షమించే ప్రసక్తే లేదని, ఇది ఎమ్మెల్యేల భవిష్యత్తు పై ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం కచ్ఛిచమైన ఆదేశాలు జారీచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News