Sunday, February 2, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi February 1st Episode: ఆస్తులు అమ్మేసి కావ్య, రాజ్ అమెరికా వెళ్ళిపోతున్నారని చిచ్చు రేపిన...

Brahmamudi February 1st Episode: ఆస్తులు అమ్మేసి కావ్య, రాజ్ అమెరికా వెళ్ళిపోతున్నారని చిచ్చు రేపిన రుద్రాణి..

ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్‌కి, కావ్యకి పాస్‌పోర్ట్ విసా కావాలని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతాడు. నెలలో మొత్తం అన్ని రెడీ అయిపోవాలి వెంటనే చేయండి అంటాడు. ఆ మాటలు విన్న రుద్రాణి వీళ్లు ఇద్దరూ మొత్తం ఆస్తి పెట్టుకుని చెక్కేస్తున్నారని అనుమానిస్తుంది. తరువాత రుద్రాణి కావ్య ఇంగ్లీషు నేర్చుకుంటుంటే వచ్చి నిజం తెలుసుకుందామనుకుంటుంది. కావ్య పెద్దగా రెస్‌పాండ్ అవ్వలేదని ఇదంతా ఎలా అయినా తెలుసుకోవాలని దాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి నీకొక విషయం చెప్పాలి అని రాజ్, కావ్య అమెరికావెళ్తున్న విషయం చెప్తే ఆమె వినకుండా వదిలేస్తుంది.

- Advertisement -

నువ్వు పూర్తిగా తెలుసుకోకుండా నాకు చెప్తావు నేను వెళ్లి బయట వాగుతాను అది తిరిగి గోతిలో పడతాను అని వదిలేస్తుంది. పాస్‌పోర్ట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ మీడియేటర్‌కు ఇవ్వమని కావ్య స్వప్నకు ఇస్తుంది. ఆ పేపర్స్‌ని చూడటానికి రుద్రాణి అవేంటో చూడాలని తెగ ఆవేశ పడుతుంది.. కానీ స్వప్న ఇవ్వకుండా తప్పించుకొని పోతుంది. నువ్వు ఇచ్చేది ఏంటి కాసేపట్లో బ్రోకర్ వస్తాడు వాడి నుంచే తెలుసుకుంటాను అనుకుంటుంది. మరోవైపు ఫేక్ లిరిసిస్ట్ కళ్యాణ్ రాసిన పాటను అతనే రాసినట్టు చెప్పుకుని మ్యూజిక్ డైరెక్టర్‌కు ఇస్తాడు. కానీ ఆ డైరెక్టర్ పాటలో చిన్న పదం మార్చమంటే ఈ ఫేక్ అతను మాత్రం మార్చడు.

డైరెక్టర్ కారు దగ్గరికి వెళ్లాక కళ్యాణ్ వెళ్లి పదం మార్చి చెప్తాడు. అప్పుడు ఆ డైరెక్టర్ నువ్వే ఈ పాట రాశావ్ అని నాకు తెలుసు.. నువ్వు మంచి రైటర్ అవుతావు. త్వరలో మనం కలిసి పని చేద్దాం అని చెప్పి వెళ్తాడు. మరోవైపు కావ్య, రాజ్ కార్‌లో వెళ్తూ కావ్య ఇంగ్లీషు గురించి మట్లాడకుంటారు. తర్వాత రాజ్‌కి ఎస్సై ఫోన్ చేసి నందాని చంపిన వాడి బండి నంబర్ దొరకింది కానీ అది ఫేక్ నంబర్ అని చెప్తాడు. అక్కడ ఇంట్లో పాస్ పోర్ట్ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వచ్చిన బ్రోకర్‌ని రుద్రాణి డాక్యుమెంట్స్ గురించి ఆరా తీసి కావ్య రాజ్ అమెరికాకు వెళ్తున్నట్టు ఇంట్లో వాళ్ళ ముందు బయటపెడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News