మరికాసేపట్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్(Union Budget)కు ఆమోదం తెలిపింది. అంతకుముందు నిర్మలమ్మ ఆర్ధిక శాఖ కార్యాలయం నుంచి బయలుదేరి రాష్ట్రపతి భవన్ వెళ్లి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము(Draupadi Murmu) మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బడ్జెట్‌కు సంబంధించిన పత్రాలను ఆమెకు అందజేశారు. అనంతరం నిర్మలమ్మ పార్లమెంట్ బయలుదేరారు.