ప్రయాగ్ రాజ్ లో తప్పిపోయిన టీటీడీ ఉద్యోగి సుబ్రహ్మణ్యం ఆచూకీ లభ్యమైంది. ప్రయాగ్ రాజ్ కు 20 కిలోమీటర్ల దూరంలో సుబ్రహ్మణ్యం ఆచూకీ కనుగొన్నారు. ప్రయాగరాజ్ లోని నమూనా ఆలయంకు సుబ్రహ్మణ్యంను పోలీసులు తీసుకొస్తున్నారు.
కుంభమేళాలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీనివాసుని నమూనా ఆలయంలో విధుల నిమిత్తం అర్చకులు, పరిచారకులు, సూపరిటెండెంట్, సబ్ ఆర్డినేట్, సానిటరీ వర్కర్స్ కు ప్రయాగ్ రాజ్ లో విధులు కేటాయించింది టీటీడీ. ఈ నేపథ్యంలో నమూనా ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సుబ్రమణ్యం షాపింగ్ కు వెళ్లి వస్తానని చెప్పి 29 వ తేది సాయంత్రం ప్రయాగరాజ్ కు వెళ్లి తిరిగి గదికి కానీ, నమూనా ఆలయానికి రాలేదు. ఉదయం వరకు సుబ్రమణ్యం కోసం ఎదురు చూశారు సహచరులు. అయిన రాకపోవటంతో సుబ్రమణ్యం మిస్ అయినట్లు అధికారులకు తెలిపారు.
దీంతో వెంటనే స్పందించిన టీటీడీ అధికారులు ఉత్తర ప్రదేశ్ పోలీసులను ఆశ్రయించారు. సుబ్రహ్మణ్యం ఆచూకీ కోసం భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. బయటకు వెళ్లిన సుబ్రహ్మణ్యం ఆచూకీ శనివారం లభ్యం అయింది.
Tirumala: కుంభమేళాలో తప్పిపోయిన టీటీడీ ఉద్యోగి సుబ్రహ్మణ్యం ఆచూకీ లభ్యం
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES