Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Children: పిల్లలకేం కావాలి? పిల్లలేం కావాలి?

Children: పిల్లలకేం కావాలి? పిల్లలేం కావాలి?

‘మీ పిల్లలు మీ పిల్లలే కారు! అనంత స్వీయా ర్ధమైన జీవితాభిలాషకు వారు కొడుకులు, కూతుళ్ళు. వాళ్ళు మీ ద్వారా వచ్చారు కానీ, మీనుంచి కాదు. మీతోనే ఉంటున్నా మీకు చెందినవారు కారు. మీ ప్రేమను వారికి ఇవ్వగలరే కానీ ఇవ్వలేరు మీ ఆలోచనలనే మాత్రం. వారికున్నాయి స్వీయ ఆలోచనలు అంటాడు ఖలీల్‌ జిబ్రాన్‌.
నిజంగా మరి పిల్లలకేం కావాలి పిల్లలేం కావాలి. వారు మన నుండి ఏం ఆశిస్తున్నారు? సంరక్షకులుగా మనం వారికి ఏమి ఇవ్వాలి. ఎలాంటి వాతావరణం. మనం కల్పించాలి. ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిం చాలి. ఏ విధమైన శిక్షణా పరమైన మానసిక సంసిద్ధతను మనం తల్లిదండ్రులుగా కల్పించాలనేది ప్రశ్న ఇటువంటి సంక్లిష్టమైన సంఘర్షనాత్మకమైన సంశయాలకు సమాధా నం ఎవరు ఇస్తారనేది కూడా ప్రశ్నే, ‘మనిషి సంఘజీవి’ అంటాడు ప్రఖ్యాత తత్త్వవేత్త అరిస్టాటిల్‌, సంఘం నుండి మనిషిని వేరుచేసి చూడలేం ఒకవేళ మనిషిని సంఘం నుండి లేదా సమూహం నుండి బహిష్కరిస్తే అతని మాన సికస్థితి ఎలా వుంటుంది. అతని ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా మానసిక శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాల ద్వారా నిరూపించారు. అంటే కుటుం బం నుండి మనిషిని వేరుగా ఊహించలేం ఇవన్ని ఊహ జీవిత ఆలోచనలు పరిశోధనలకు శాస్త్రీయ నిరూపనలు ఆధారం అవుతాయి కాబట్టి వాటి ఫలితాలు కూడా కాదనలేని వాస్తవం అందుకే ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త జె.బి. వాట్సన్‌ ఇలా అంటాడు. నాకు మంది పిల్లల్ని ఇవ్వండి నేను వారిని మీరు కోరిన విధంగా తీర్చిదిద్ది ఇవ్వగలను అని అంటే పిల్లల్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చునో పై స్టేట్మెంట్‌ను బట్టి అర్ధం చేసుకోవచ్చును ఏమి తెలియని, ఎలాంటి ముద్రలు ఇంకా పడని పసి మనసులలో ఎలాంటి శిక్షణ వైపు వారిని మనం సన్నద్దు లను చేస్తామో అలాంటి వారే తయారుకాగలరు. ఇక్కడ చరిత్రలో నమోదు కాబడిన ఒక విషయాన్ని ప్రస్తావించ దలిచాను జర్మనీ ఛాన్సలర్‌ అడాల్ఫ్‌ హిట్లర్‌ బాల్యంలో జరిగిన సంఘటన పాఠశాలలో చదువుతున్న రోజుల్లో ఒక యూదు టీచర్‌ హిట్లర్‌ను దండించటం జరిగింది. ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన హిట్లర్‌ 1933లో జర్మనీ దేశా నికి అధ్యక్షుడిగా మారిన తర్వాత ‘గెస్టసో’ అనే రహస్య గుడాచార దళాన్ని ఏర్పాటుచేసి తనకు వ్యతిరేకంగా వున్న ఎంతో మంది యూదులను గ్యాస్‌ చాంబర్లో బంధించి చిత్ర హింసలుపెట్టి చంపించిన సంఘటనలు చరిత్ర చెప్పిన సజీవ సాక్ష్యాలు.
అందుకే ప్రతి మనిషి జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించే దశ బాల్యదశ ఈ దశలో పడే సానుకూల దృక్ప ధాలే పిల్లల మానసిక స్థితిపై ఆధారపడి వుంటుందనేది కాదనలేని వాస్తవం. గతమెంతో ఘనకీర్తి అన్నట్లు మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి ఒకప్పుడు సామూహిక జీవన విధానం వుండేది. ఇప్పుడు వ్యష్టి జీవి తానికి అలవాటుపడి యాంత్రిక జీవితం వైపు మొగ్గు చూపుతుండటం. ఆధునికత సంతరించుకొని సామూహిక జీవనం నుండి ఒంటరితనం వైపు ప్రయాణించటం బాధ కల్గించే విషయం. అందుకే నేడు నిత్యం మైనర్లు పబ్బుల్లో, క్లబ్బుల్లో, రేవ్‌ పార్టీలో, డ్రగ్స్‌ బాధితులుగానో, అత్యాచార కేసుల్లో నిందితులుగానో, హింసాయుత సంఘటనల్లో బాధకల్గించే విషయం అంటే లోపం ఎక్కడుంది, ఎవరిని దీనికి బాధ్యుల్ని చేయాలి అన్నది అసలైన ప్రశ్న, తల్లి దండ్రులదా. వారు కలిసి తిరిగిన సమవయస్కులదా, లేదా విద్యా సంస్థలదా? తప్పు జరిగిన తర్వాత కారణాలు, ఫలితాలు ఎలా ఉంటాయనేది నేర తీవ్రతను బట్టి నిర్ధా రించే మరొక అంశం. ఇటీవలి కాలంలో హైద్రాబాద్‌ నడిబొడ్డున జరిగిన మైనర్‌ బాలిక అత్యాచార సంఘటనలో ఐదుగురు మైనర్లు, బాధిత బాలిక కూడా మైనరే కావటం ఇక్కడ ప్రస్థావనార్హం, పిల్లల శారీరక మానసిక పెరుగుదల, వికాసం తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి వారికి సరైన మార్గ దర్శనం చేస్తూ ఉండాలి బాలిక ఐతే తల్లి బాలుడు ఐతే తండ్రి చొరవ తీసుకొని. వారిలో సహజమైన ప్రవర్తన అసహజమైన ప్రవర్తన వాటి వల్ల కలిగే పరిణామాలు, ఫలితాలు వివరించి చెప్పగలగాలి.
ఈ సందర్భంగా మరొక సంఘటనను గుర్తుచేయాలి 2008 నవంబర్‌ 11న ముంబాయిలో జరిగిన మారణ హోమం మన అందరికీ తెలిసినదే. ఆ ఉగ్రదాడి వల్ల ఎంతో మంది చనిపోయారు. మరికొంత మంది గాయపడ్డారు ఆస్తి ప్రాణ నష్టం వెలకట్టలేనిది. ఈ దాడులలో పాల్గొన్న నిందితులలో ఒకడు ‘అజ్మల్‌ అమీర్‌ కసబ్‌” తండ్రి ఫరీద్‌ కోట్‌ గ్రామంలో నివసించే నిరుపేద రంజాన్‌ పండక్కి కొత్తబట్టలు కొనివ్వమని తండ్రిని అడిగితే కొనివ్వలేని పేదరికం. తండ్రి మీద కోపంతో ఇంట్లోంచి పారిపోవటం అతని ఆర్థిక స్థితిని ఆసరాగా చేసుకొని కొంత నగదు ముట్టజెప్పి చెప్పిన పనిచేస్తే కుటుంబం ఇంకా ఉన్నత స్థితికి వెళ్తుందని మభ్యపెట్టి అతనిని తీవ్రవాదిగా శిక్షణ ఇప్పించటం, తదనంతరం ముంబాయి మారణ హెూమా నికి ప్రత్యక్ష కారకుడు కావటం మనందరికి తెలిసిన విషయమే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏమి తెలియని పసి మనసులలో ఎలాంటి ముద్రలను మనం బలంగా వేస్తామో వాటినే పెద్దైన తర్వాత అనుసరించే ప్రమాదం వుంది. ఇక్కడ ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించాలి ‘చిన్నపిల్లల మనస్సు ఏమి వ్రాయని నల్ల బల్ల లాంటిది. దానికి ‘టబ్యులారాసా’ అని పేరు పెట్టాడు. దీనిని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పిల్లల మన స్తత్వాలు, వారు పెరిగే పరిసరాలు మరియు కుటుంబ నేపధ్యం వారిని ఎలా ప్రభావితం చేస్తుందో మనం ఇక్కడ గమనించవచ్చును.
మారుతున్న జీవన సరళి. ఆకర్శింపబడుతున్న పాశ్చాత్య సంస్కృతి, కొడిగడుతున్న మానవ విలువలు, పలుచబడుతున్న సంబంధ బాంధవ్యాలు దీనికి తోడు మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల పిల్లల్లో కలిగే మానసిక మరియు శారీరక మార్పుల ఫలితంగా వచ్చే మార్పులను అర్ధం చేసుకోలేక సంఘర్షణకు గురై, తల్లి దండ్రులు పర్యవేక్షించక, సరైన మిత్రులు మార్గదర్శనం చేయక, ఉపాధ్యాయులు వారిలో వచ్చే ప్రవర్తనాపరమైన మార్పులను గమనించకపోవటం ఫలితంగా జరుగుతున్న నేరాలు, ఘోరాలు దారితప్పుతున్న బాల్యం వెరసి దాని ఫలితాలు, పర్యవసానాలు సమాజంపై ప్రభావితం చేయ టం అందుకే పసి పిల్లల్లో వచ్చే మార్పులను మొగ్గలోనే తుంచివేస్తే ఇలాంటి సంఘటనలు కొంతలో కొంతవరకైనా నివారించగల్గిన వారమౌతాము.
ఇక్కడ మరో ఇద్దరు ప్రఖ్యాత వ్యక్తుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం. ఉందనేది నా అభిప్రాయం ఒకరు ఫ్రెంచ్‌ తత్త్వవేత్త ‘జీన్‌ జాక్‌ రూసో’ మరొకరు ‘జెఫ్‌ బెజోష్‌’ రూసో బాల్యంలోనే తల్లిని కోల్పోవడం తండ్రి బాగా మధ్యం సేవించి. చిన్న పిల్లవాడైన రూసో చేత బూతు పుస్తకాలు చదివిస్తూ ఆనందించేవాడు అలాంటి పరిస్థితుల మధ్య పెరిగి పెద్దవాడై అతను చేసిన రచనలు (సోషల్‌ కాంటాక్ట్‌, ది ఎమిలి) ఫ్రెంచ్‌ విప్లవానికి పరోక్ష కారణాలుగా నిలిచాయని చరిత్ర చెప్పిన సత్యమే కదా. ఇక జెఫ్‌ బెజోష్‌ ఇతని తల్లి (జాక్లిన్‌) యవ్వనంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించడం గర్భం దాల్చడం అతను మోసం చేయడం ఆత్మహత్యకు పూనుకొని విరమించుకోవడం అనంతరం జెఫ్‌ బెజోష్‌ జన్మించడం. నేడు అమెరికాలోని సంపన్నులలో బెజోష్‌ ఒకడు. ఇక్కడ హిట్లర్‌ ఐనా, కసబ్‌ ఐనా. రూసో ఐనా బెజోష్‌ ఐనా వారి కుటుంబ నేపథ్యాలు వేరు అలానే వారు పెరిగిన విధానం కూడా ఇక్కడ గమ నించాల్సిన విషయం.
పిల్లలకేం కావాలో తల్లిదండ్రులు గమనిస్తే వారు కోరుకున్నట్లుగానే తయారు అవుతారు. పిల్లలేం కాకూ డదో తల్లిదండ్రులు ఒక ప్రణాళిక బద్ధంగా వారికి సలహాలు, సూచనలు సరైన మార్గదర్శకత్వం, పర్వవేక్షణ, వారి ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా తల్లిదం డ్రులు కూడా నడుచుకుంటే ఓ అమృత ప్రణయ్‌, నాగా రాజు అశ్రిన్‌, ఇటీవల హైదరాబాద్‌ లో జరిగిన అత్యాచార సంఘటనలు మరియు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే తెచ్చిన ‘అగ్నిపధ్‌” పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసలో పాల్గొంటున్న యువత తప్పు ఎక్కడ జరుగుతుందో ముందే పసిగడే ఇలాంటి సంఘటనలు జరుగవు. జరిగిన తర్వా త.. నష్ట నివారణ చర్యలు అంతంత మాత్రంగానే చేపట్టి వదిలేస్తే మళ్ళీ జరగకుండా ఎలా ఉంటాయి. అందుకే పాఠశాల స్థాయిలోనే మానసిక నిపుణుల ద్వారా విద్యా ర్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించే ఏర్పాటు చేయాలి ప్రతి పాఠశాల, కళాశాల స్థాయిలో కనీసం నెలకు ఒకసారి చట్టాలపట్ల, వాటిని ఉల్లంఘిస్తే పడే శిక్షలు వాటి పర్యవసా నాలు ఎలా ఉంటాయో వివరించి చెప్పాలి. తద్వారా కొంత వరకైనా శిక్షలపట్ల భయంతో తప్పు చేయడానికి భయపడుతారు. పిల్లలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా విద్యా ప్రణాళికలో ఇలాంటి అంశాలను చేర్చి నేరాలు వాటికి పడే శిక్షలు, రాజ్యాంగం రాజ్యాంగ విలువలు, నైతిక విలువలు బోధించే ప్రయత్నం చేయాలి.
అందుకే పిల్లలు మీ పిల్లలే కాని వారికి ఆశలుం టాయి పిల్లలకేం కావాలో గమనిద్దాం వారి ఆశలు, ఆలోచ నలకు అనుగుణంగా నడుచుకుందాం, పిల్లలేం కావాలో, ఏం కాకూడదో నిర్దేషించుకొని మసలుకుందాం మంచి సమాజాన్ని నిర్మిద్దాం. కొఠారి కమిషన్‌ చెప్పినట్లుగా ‘దేశ భవిష్యత్తు గరగతి గదిలో రూపు దిద్దుకుంటుంది‘. అన్న ట్లుగా మంచి నడవడికను, మంచి భవిష్యత్తును పిల్లలకు అంది. ఆరోగ్యకరమైన మరియు శాంతియుతమైన సమా జాన్ని తయారు చేద్దాం.
డా॥మహ్మద్‌ హసన్‌
9908059234

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News