లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందన్నారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా పలు రంగాలకు వరాలు కురిపిస్తున్నారు.
దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని ద్వారా 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరనట్లు తెలిపారు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాని.. దీంతో 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభించనున్నట్లు పేర్కొన్నారు. ఇక చిన్న పరిశ్రమలకు ఇచ్చే రుణాలను రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు.. స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు.