కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతరామన్ కట్టుకున్న మధుబని చీర చేనేత వస్త్రంగా భారతదేశంలో ప్రసిద్దిగాంచింది. పశ్చిమ బెంగాల్, బీహార్ ఈ చీరలు చాలా ఫేమస్. మధుబని సారీలను చేతితో పెయింట్ చేస్తారు. ఇవి వివిధ రకాల పదార్థాలు, శైలుల్లో లభిస్తాయి. ఈ మధుబని వర్క్ చీరలు ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు ఆన్లైన్ లో రూ.500 నుంచి ప్రారంభం అవుతాయి. మధుబని శారీల ధర, శారీ పరిమాణం, రంగు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
రంగులు-చేపలు ..అంతా ప్రత్యేకమే
ఈ చీరలు హైదరాబాద్, విజయవాడ షాపుల్లో కూడా దొరుకుతాయి. ఈ చీరలపై చేత్తో వేసే పెయింటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇవి సంప్రదాయ వస్త్రాలుగా ప్రఖ్యాంతిగాంచాయి. ఈ చీరలు కళాంజలి వంటి షాప్స్, అమెజాన్ లాంటి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. మనకు తెలుగు రాష్ట్రాల్లో కళంకారి ఎలాగో బీహార్-బెంగాల్ లో మధుబని కాంతా వర్క్ చీరలు చాలా ఫేమస్.
సహజ సిద్దమైన రంగులకే ప్రాధాన్యత
సాధారణంగా మధుబని వస్త్రాలపై రాధా కృష్ణులు, రాజా రాణి లేదా ప్రకృతిని ఇందులో కళాత్మకంగా వేస్తారు. ఇందుకు వాడే రంగులు కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ కాకపోవటం మరో ప్రత్యేకత. ఈ రంగులను గ్రామీలు స్వయంగా తయారు చేసుకుంటారు. స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు, ఆకులు, పూలనే రంగులగా తయారు చేసి, వస్త్రాలపై వీటిని అందంగా వేస్తారు. చేపలు ఈ ఆర్ట్ లో ఎక్కువగా వాడే కళారూపం ఇది సంపదకు, శుభానికి చిహ్నమని గ్రామీణుల విశ్వాసం. అంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తున్నట్టు లెక్కన్నమాట.
ఇవి మహిళలు ధరిస్తే చాలా ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. సంప్రదాయానికి ప్రతీకగా, శతాబ్దాల నాటి కళకు నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. మధుబని శారీల ధరలు కొన్ని వెబ్సైట్లలో ఇలా ఉన్నాయి