బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్ తెలిపారు. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ-శ్రమ్ పోర్టల్ కింద నమోదుచేసి పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. కేంద్రం నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలగనుంది.
బీమా రంగంలో ఎఫ్‌డీఐ(FDI) ప్రస్తుతం ఉన్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుకుతున్నట్లు వెల్లడించారు. రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు అందించనున్నట్లు చెప్పారు. ఇక కొత్త ఉడాన్ పథకం మరో 120 రూట్లలో అమలు చేస్తామన్నారు. 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యమన్నారు. బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.