బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) మహిళలకు శుభవార్త అందించారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. తొలిసారి సొంత వ్యాపారాలు ప్రాంభించాలనుకునే వారితో పాటు వ్యాపారాలను విస్తరించాలనుకునే మహిళలకు ఈ పథకం కింద రూ.2కోట్ల వరకూ రుణాలు అందిస్తామన్నారు. దీని ద్వారా మొత్తం 5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నట్లు పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు, వెనకబడిన వర్గాలకు ఉద్యోగాలను కల్పిస్తామని ఆమె వెల్లడించారు.