రూ.50 లక్షల 65వేల 345కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) ప్రకటించారు. ఇందులో ముఖ్యంగా రక్షణ శాఖకు దాదాపు రూ.5లక్షల కోట్లు కేటాయించారు.
కేటాయింపులు ఇలా..
₹ రక్షణశాఖ- రూ.4,91,732 కోట్లు
₹ గ్రామీణాభివృద్ధి- రూ.2,66,817 కోట్లు
₹ హోంశాఖ- రూ.2,33,211 కోట్లు
₹ వ్యవసాయం, అనుబంధ రంగాలు- రూ.1,71,437 కోట్లు
₹ విద్య- రూ.1,28,650 కోట్లు
₹ ఆరోగ్యం- రూ.98,311 కోట్లు
₹ పట్టణాభివృద్ది- రూ.96,777 కోట్లు
₹ ఐటీ, టెలికాం- రూ.95,298 కోట్లు
₹ విద్యుత్- రూ.81,174 కోట్లు
₹ వాణిజ్యం, పరిశ్రమలు- రూ.65,553 కోట్లు
₹ సామాజిక సంక్షేమం- రూ.60,052 కోట్లు
వైజ్ఞానిక విభాగాలు- రూ.55,679 కోట్లు
కేంద్రానికి వచ్చే ఆదాయం ఎలా..
₹ ఆదాయపన్ను- 22 శాతం
₹ అప్పులు, ఇతర మార్గాల ద్వారా- 24 శాతం
₹ జీఎస్టీ, ఇతర పన్నులు- 18 శాతం
₹ కార్పొరేషన్ పన్ను- 17 శాతం
₹ పన్నేతర ఆదాయం- 9 శాతం
₹ కేంద్ర ఎక్సైజ్- 5 శాతం
₹ కస్టమ్స్- 4 శాతం
₹ క్యాపిటల్ రిసిప్ట్స్ -1 శాతం