Saturday, April 19, 2025
HomeNewsBudget 2025: కేంద్ర బడ్జెట్ పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం..

Budget 2025: కేంద్ర బడ్జెట్ పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం..

బడ్జెట్‌ (Union Budget)పై కేంద్రమంత్రి రామ్మెహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ‘దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అన్న గురజాడ అప్పారావు మాటలను గుర్తుచేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించడం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు.

- Advertisement -

బడ్జెట్ లో రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడం చరిత్రాత్మకమని అన్నారు. ఈ తరహా నిర్ణయం గతంలో ఎప్పుడూ తీసుకోలేదని అన్నారు. ఎంఎస్‌ఎంఈలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారని.. దీని ద్వారా ఏపీకి ప్రయోజనాలు దక్కనున్నాయని తెలిపారు.

మధ్యతరగతికి మరింత ప్రయోజనం
ఈ బడ్జెట్ మధ్య తరగతి వారికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హర్షించాల్సిందేన్నారు. బడ్జెట్‌పై ఏపీకి చెందిన కూటమి ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు దఫాలుగా కేంద్రంతో సీఎం చంద్రబాబు సంప్రదింపులు జరిపారన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద చేపట్టే పనుల గడువు ముగుస్తున్నందున వాటిని పొడిగించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారని, బడ్జెట్‌లో ఆ మేరకు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారని తెలిపారు.

2028 వరకు జల్ జీవన్ మిషన్ పనులు పొడిగింపు
జల్‌జీవన్‌ మిషన్‌ పనులను 2028 వరకు పొడిగించారన్నారు. దీని వల్ల రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగు నీరు అందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం రూ.15వేల కోట్ల జల్‌జీవన్‌ మిషన్‌ నిధులను వినియోగించుకోలేదని రామ్మోహన్‌ విమర్శించారు.

ఉడాన్‌ పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగింపు
ఉడాన్‌ పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగించడంపై నిర్మలా సీతారామన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News