140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్(Union Budget 2025) ఇది అని ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. ఈ బడ్జెట్ దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుందన్నారు. ఉద్యోగులకు రూ.12లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయం అని తెలిపారు. దీని వల్ల పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
- Advertisement -
సాధారణంగా బడ్జెట్‌లు ప్రభుత్వ ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయని.. ఈ బడ్జెట్ మాత్రం ప్రజల సేవింగ్స్ పెంచేందుకు ఉద్దేశించిందని పేర్కొన్నారు. అనేక రంగాల్లో యువతకు అవకాశాలను కల్పిస్తున్నామని.. భారత అభివృద్ధిలో ఈ బడ్జెట్ ఓ మైలురాయిని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన అభినందనలు తెలిపారు.