Saturday, October 5, 2024
Homeఇంటర్నేషనల్Germany: టాప్లెస్ గా స్విమ్ చేయచ్చని రూల్స్ సవరించిన అధికారులు

Germany: టాప్లెస్ గా స్విమ్ చేయచ్చని రూల్స్ సవరించిన అధికారులు

బెర్లిన్ సిటీలో ఎటువంటి వివక్ష చూపకుండా ఎవరైనా టాప్ లెస్ గా స్విమ్ చేయవచ్చనే ఆదేశాలు వెలువడ్డాయి. బెర్లిన్ సిటీ అధికారులపై విపరీతమైన వివక్షాపూరిత కామెంట్లు రావటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బీబీసీ వెల్లడించిన వివరాల ప్రకారం బెర్లిన్ సిటీలోని పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ లో ఎవరైనా ఇకమీదట టాప్ లెస్ గా ఈత కొట్టవచ్చు. సన్ బాతింగ్ కోసం వెళ్లిన కొందరు మహిళల ఫిర్యాదుతో ఇదంతా జరిగింది. ఫ్రీ బాడీ కల్చర్ కోసం పోరాటం మొదలు కావటంతో ఈ మార్పులు చేసినట్టు అధికారులు వివరించారు. జర్మనీలో న్యూడిటీ అన్నది ఎప్పటినుంచో ఓ కల్చర్ గా వస్తోంది. ఇక్కడ ఎటువంటి డ్రెస్ కోడ్ ను ఎవరూ సమర్థించరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News