కేంద్ర బడ్జెట్-2025(Union Budge)పై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ దివాళా కోరు ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ బడ్జెట్ ఉందంటూ విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
“బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్‌లా ఈ బడ్జెట్ ఉంది. ప్రస్తుతం ప్రపంచమంతా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం దివాళా కోరు ఆలోచనలు చేస్తోంది” అని తెలిపారు.
మరోవైపు ఈ బడ్జెట్‌పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బడ్జెట్‌లో పేదలు, సామాన్యులకు ఎందులోనూ ఊపశమనం కల్పించలేదని మండిపడుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందును ఆ రాష్ట్రం కోసమే బడ్జెట్ పెట్టినట్లు ఉందని ఆరోపిస్తున్నాయి.