కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్(Income Tax) కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ట్యాక్స్ రిబేట్ పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచి మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించింది. దీంతో సంవత్సరానికి రూ.12 లక్షలు ఆదాయం సంపాదిస్తున్న వారు రూ.80 వేలు వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక ఏడాదికి రూ.24 లక్షలు సంపాదిస్తుంటే రూ.1.10 లక్షల కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
ఈ మేరకు ఎవరికి ఎంత ఆదాయం లబ్ధి చేకూరుతుందో ఓ టేబుల్‌ను విడుదల చేసింది. ఈ టేబుల్ ప్రకారం.. రూ.12.75 లక్షల వరకు (రిబేట్‌తో కలుపుకొని) ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆపై ఎక్కువ సంపాందించే వారికి రిబేట్ ఉండదు కాబట్టి కొంత మేర పన్ను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.