Saturday, February 1, 2025
Homeచిత్ర ప్రభHrithik: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గొడవ పడి విడిపోయారు.. హృతిక్ పై తండ్రి కామెంట్స్..!

Hrithik: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గొడవ పడి విడిపోయారు.. హృతిక్ పై తండ్రి కామెంట్స్..!

Hrithik: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గొడవ పడి విడిపోయారు.. హృతిక్ పై తండ్రి కామెంట్స్..!

- Advertisement -

Rakesh roshan about hrithik roshan sussanne khan divorce

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫైర్లు, విడాకులు అంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఏ బాంబు పేలుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అభిప్రాయ భేదాలు, వ్యక్తిగత కారణాలతో తమ జీవిత భాగస్వాముల నుంచి విడిపోతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాకేష్ రోషన్.. తన కుమారుడు, సూపర్ స్టార్ హృతిక్ రోషన్, సుజానే ఖాన్‌ విడాకులపై స్పందించారు. 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్న హృతిక్, సుస్సానేలు.. 13 సంవత్సరాలు కలిసి జీవించారు. ఈ దంపతులకు హ్రెహాన్, హృదాస్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆ తర్వాత ఏమైందే ఏమో కానీ.. 2014లో హృతిక్-సుజానే విడిపోయారు. అనంతరం వీరి శత్రువులుగా మిగిలిపోకుండా మంచి మిత్రులుగా తమ మధ్య అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హృతిక్.. నటి సబా అజాద్ తో ప్రేమలో ఉండగా.. సుజానే, అర్స్ లన్ గోనీలు ప్రేమించుకుంటున్నారు. ఈ రెండు ప్రేమ జంటలూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్ సుజానే విడిపోవడానికి కారణం.. ఏమై ఉంటుందన్నది చాలా మందికి ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది.

తాజాగా దీనిపై హృతిక్ తండ్రి, దర్శక నిర్మాత, నటుడు రాకేష్ రోషన్ స్పందించారు. జరిగిందేదో జరిగిపోయిందని.. విడిపోయినంత మాత్రాన సుజానే తమకు ఏమీ కాకుండా పోదని అన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నది వాళ్లిద్దరని.. గొడవ పడి విడిపోయింది కూడా వారేనని తెలిపారు. ఏది ఏమైనా సుజానే తమ ఇంటికి వస్తుందని తెలిపారు. ఆమెను తమ కుటుంబ సభ్యురాలిగానే భావిస్తామని పేర్కొన్నారు. ఇక తన కుమారుడు హృతిక్ గురించి మాట్లాడుతూ.. ఇప్పటికీ తన కొడుకు హృతిక్, కూతురు సునయనకు తానంటే భయమని తెలిపారు.

వారికి ఎందుకు అంత భయమో తనకు అర్థం కావడం లేదని.. తాను ఎవరిపైనా అరిచేవాడిని కాదని.. అనవసరంగా ఎవరినీ తిట్టనని పేర్కొన్నాడు. కాకపోతే క్రమశిక్షణగా ఉంటానని వివరించాడు. అందరం ఫ్రెండ్స్ లా కలిసిపోయి మాట్లాడుకుంటాం అని చెప్పకొచ్చాడు. రాకేష్ రోషన్ ఫ్యామిలీపై ఇటీవల ద రోషన్స్ అని డాక్యుమెంటరీ రిలీజైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News