ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది డయాబెటిస్(Diabetes)తోనే బాధపడుతున్నారు. వందలో 70 శాతం మంది దీని బారిన పడుతున్నారు. కారణం ఆహరపు అలవాట్లు, జీవనశైలీలో మార్పులు. డయాబెటిస్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల కలిగే జీవక్రియ రుగ్మత. దీనిని డయాబెటిస్ లేదా షుగర్, మేధుమేహం అని కూడా అంటారు. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల మధుమేహం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఒకప్పుడు ఈ పేరే తెలియదు. కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది.ఆ రోజుల్లో వయస్సు పై పడే కొద్ది వచ్చే ఈ మధుమేహం ఈ రోజుల్లో 30 ఏళ్లకే వచ్చేస్తుంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శరీరాన్ని కష్టపెట్టకపోవడమే దీనికి కారణమని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఈ లక్షణాలు ఎలా పసిగట్టలో వైద్యులు తెలిపారు. అవేంటో చూద్దాం పదండి.
డయాబెటీస్ వచ్చే ముందు వచ్చే లక్షణాలు
మధుమేహం రాకుండా చాలా జాగ్రత్త పడాలి. వచ్చిదంటే దానిని కంట్రోల్ చేయలేం. ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తే డయాబెటిస్ సంకేతాలేనని గుర్తుంచుకోవాలి. ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం
ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్లడం
సాధారణం కంటే ఎక్కువ సార్లు యూరిన్ రావటం ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. ప్రధానంగా షుగర్ స్థాయిలు అధికంగా రాత్రిల్లో పెరుగుతాయి. ఈ మధుమేహం స్థాయి పెరిగితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఫలితంగా బ్లాడర్ త్వరగా నిండిపోయి మెలుకువ వచ్చేస్తుందన్నారు. ఇలా సాధారణం కంటే ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది.
డీహైడ్రేషన్
ఎక్కువగా మూత్ర విసర్జన చేయటం వల్ల బరువు తగ్గుతారు. అంతే కాదు డీహైడ్రెషన్ కూడా పెరుగుతుందంటున్నారు. ప్రొటీన్లు యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోవటంతో ఒక్కసారిగా బరువు తగ్గిపోతారని చెబుతున్నారు. బరువు తగ్గటం డయాబెటిస్ లక్షణాల్లో ఒకటని చెబుతున్నారు.
గాయాలు త్వరగా మానవు
ఏదైనా అనుకోకుండా శరీరంపై గాయాలు అయితే త్వరగా మానిపోతాయి. కానీ డయాబెటిస్ వచ్చిన వారిలో త్వరగా గాయాలు మానవు. ఇది కూడా డయాబెటిస్ ప్రధానం లక్షణమే.
అధికంగా దాహం వేయటం
రోజుకు శరీరానికి సరిపడ నీటిని తీసుకోవాలి. కానీ షుగర్ ఉన్న వారిలో ఎంత నీరు తీసుకున్నా గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుంది. ఇది కూడా డయాబెటిస్ లక్షణమేనని అంటున్నారు వైద్యులు. గొంతు ఎండిపోవటం వంటివి ఎక్కువగా ఉంటాయి.
కంటి చూపుపై ఎఫెక్ట్
డయాబెటిస్ వచ్చే ముందు కంటి చూపు కూడా తగ్గుతుందని చెబుతున్నారు వైద్యులు. దంతాల చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు వస్తాయని చెబుతున్నారు. బాగా ఆకలి వేయటం వంటివి కనిపిస్తాయని చెబుతున్నారు.
కాళ్లలో స్పర్శ లేకపోవటం
షుగర్ వచ్చే ముందు కొంత మందికి కాళ్లలో స్పర్శ తగ్గుతుందని చెబుతున్నారు వైద్యులు. మరికొంత మందికి కాళ్లల్లో తిమ్మిర్లు ఉంటాయని చెప్పారు. ఈ లక్షణాలు కనిపించిన డయాబెటిస్ ఉన్నట్టేనని చెబుతున్నారు.
అసలు కొంతమందికి లక్షణాలే ఉండవు
కొందరిలో డయాబెటిస్ లక్షణాలు కనిపించవు. అలాంటి వారికి గుండె సమస్యలు వచ్చిన తర్వాత ఈ డయాబెటిస్ ని గుర్తిస్తున్నారు. ఈ పై లక్షణాలు మీలో ఉన్నట్లుయితే వెంటేనే వైద్యులను సంప్రదించి చికిత్సను ప్రారంభించండి. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం.