భారత్‌లో పర్యటిస్తున్న బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) వివిధ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముంబై వచ్చిన ఆయన కాసేపు రిలాక్స్ కోసం సరదాగా గడిపారు. దక్షిణ ముంబైలోని పార్సీ జింఖానా గ్రౌండ్‌లో స్థానికులతో క్రికెట్ ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. “టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా ముంబయి పర్యటన పూర్తి కాదు” అని పేర్కొన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఐదు రోజులపాటు జరుగుతోన్న లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు రిషి సునాక్ భారత్ పర్యటనకు వచ్చారు.
కాగా 2022లో బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. అయితే ఆ తర్వాత జరిగతిన 2024 ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి-సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షత మూర్తిని 2009లో వివాహం చేసుకున్నారు.