డైనమిక్ హీరో విష్ణు మంచు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’(Kannappa) చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో ఎంతో కీలకమైన శివుడి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్నారు. తాజాగా డార్లింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారని చెప్పింది. ‘‘ప్రళయ కాల రుద్రుడు! త్రికాల మార్గదర్శకుడు!! శివాజ్ఞ పరిపాలకుడు!!!’’ అని పేర్కొంది. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.