Tuesday, February 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Hindupuram: హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Hindupuram: హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం

ఏపీ వ్యాప్తంగా డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. నందమూరి బాలకృష్ణ(Balakrishna)ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిట(Hindupuram Municipality) టీడీపీ కైవసం చేసుకున్నారు. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేష్‌ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థికి 23 మంది కౌన్సిలర్ల మద్దతు పలికారు. అటు విప్ జారీ చేసినా వైసీపీకి 17 మందే ఓటు వేశారు.

- Advertisement -

ఇక ఏలూరు డిప్యూటీ మేయర్లు రెండు టీడీపీ వశమైంది. మొదటి డిప్యూటీ మేయర్‌గా ఉమామహేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. రెండో డిప్యూటీ మేయర్‌గా దుర్గాభవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా టీడీపీ మద్దతు అభ్యర్థి తహసీన్‌ 29 ఓట్ల మెజారిటీతో ఆమె ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్లుగా టీడీపీ మద్దతు అభ్యర్థులు ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News