యువ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన ‘క'(KA Movie) మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో కిరణ్ తర్వాతి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల తన 10వ చిత్రంగా ‘దిల్ రూబా'(Dilruba Teaser)అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. లవర్ప్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈమూవీ విడుదల కానుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోస్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీ ‘K’ RAMP’ అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ యుక్తి తరేజా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుంది.


